ఏడాది క్రితం ఈ వరద వచ్చుంటే చంద్రబాబు శోకాలు పెట్టేవాడు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • కర్ణాటక, మహారాష్ట్ర కావాలనే నీళ్లు వదిలాయనేవాడు
  • పథకం ప్రకారం కుట్ర జరిగిందనేవాడు
  • ట్విట్టర్ లో విమర్శించిన వైసీపీ ఎంపీ
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శల దాడి కొనసాగుతోంది. కృష్ణా నదికి భారీ వరద రావడంతో చంద్రబాబు ముందు జాగ్రత్తగా ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయడంపై విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.

ఇదే వరద ఏడాది క్రితం వచ్చిఉంటే ‘మోదీ మెప్పు కోసం కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశాయి’ అని చంద్రబాబు శోకాలు పెట్టేవారని తెలిపారు. పథకం ప్రకారం తన ఇంటిని ముంచాలని కుట్ర పన్నారని చంద్రబాబు చెప్పేవారని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని తన మీడియాలో గంటలకు గంటలు చెప్పించేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Twitter
Vijay Sai Reddy
YSRCP

More Telugu News